బాబు ఢిల్లీ టూర్.. పొత్తు కోసమేనా?

29
- Advertisement -

గత కొన్నాళ్లుగా బీజేపీ టీడీపీ పొత్తు అంశం దోబూచులాడుతుంది. ఏపీలో అధికార వైసీపీని గద్దె దించే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీని కూడా కలుపుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు గత కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసిన 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన సంగతి విధితమే. అందుకే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీతో కలిసేందుకు బీజేపీ ఎంతమాత్రం ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు ప్రత్యేక హోదా విషయంలో రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ..

ఆ తర్వాత మోడీ పాలనపై బీజేపీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి టీడీపీకి దూరంగానే ఉంటూ వస్తోంది కాషాయ పార్టీ. అయితే ఏపీలో బీజేపీకి స్వబలం లేకపోవడంతో ఏదో పార్టీ పక్షాన చేరక తప్పని పరిస్థితి. అందుకే జనసేన పార్టీతో జట్టు కట్టింది బీజేపీ. అయితే జనసేన టీడీపీ పక్షాన చేరడంతో ఇప్పుడు ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉంది బీజేపీ. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పొత్తు విషయంలో త్వరగా డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిసేందుకు డిల్లీ బయలుదేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలవాలని అమిత్ షా తో చంద్రబాబు కోరనున్నట్లు తెలుస్తోంది. అటు బీజేపీకి కూడా వేరే దారి లేకపోవడంతో టీడీపీ బీజేపీ జట్టు కట్టడం ఖాయం అని చెబుతున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. అయితే గతంలో టీడీపీతో ఎదురైన పరిణామాల దృష్ట్యా ఈసారి పొత్తులో కండిషన్స్ అప్లై చేసే అవకాశం ఉంది కాషాయ పార్టీ అధిష్టానం. మరి ఎన్నో రోజులుగా సస్పెన్స్ లో ఉన్న టీడీపీ బీజేపీ పొత్తు అంశానికి ఎలా తెర పడుతుందో చూడాలి.

Also Read:ఆ జిల్లాల్లో వైసీపీ.. పనైపోయిందా?

- Advertisement -