ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ జనసేన పార్టీల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ రెండు పార్టీల ఉమ్మడి సిఎం అభ్యర్థి ఎవరనేది గత కొన్నాళ్లుగా అందరిని ఆలోచింపజేస్తున్న ప్రశ్న ఎందుకంటే సిఎం పదవి పై పవన్ కూడా ఆసక్తి చూపిస్తుండడంతో చంద్రబాబు డెసిషన్ ఎలా ఉండబోతుందనేది కొంత చర్చనీయాంశంగా మారుతూ వచ్చింది. తాజాగా రెండు పార్టీల ఉమ్మడి సిఎం అభ్యర్థిపై నారా లోకేష్ పెదవి విప్పారు. 2024లో చంద్రబాబే తమ కూటమి సిఎం అభ్యర్థి అని తేల్చి చెప్పారు. రాష్ట్రనికి చంద్రబాబు సిఎంగా ఉండడం చాలా ముఖ్యమని టీడీపీ జనసేన తరుపున చంద్రబాబే సిఎం అభ్యర్థిగా ఉంటారని, ఆయన ఆద్వర్యంలోనే అందరం పని చేస్తామని లోకేష్ క్లారిటీ ఇచ్చారు. .
దీంతో సిఎం పదవి విషయంలో పవన్ వెనక్కి తగ్గినట్లేనా ? అనే టాక్ చర్చ జరుగుతోంది. ఆ మద్య సిఎం పదవి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పవన్ తెగేసి చెబుతూ వచ్చారు. కానీ తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ ఏపీ విషయంలో కూడా మనసు మార్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. పైగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కేవలం 20-25 సీట్లు కేటాయించే ఆలోచనలోనే చంద్రబాబు ఉన్నారట. దాంతో పవన్ కూడా సీట్లు సీట్ల విషయంలో కొంత వెనక్కి తగ్గడంతో పాటు సిఎం అభ్యర్థి విషయంలో కూడా బాబు కే ఫైనల్ డెసిషన్ అప్పగించినట్లు టాక్. అందుకే నారా లోకేష్ ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ లో చంద్రబాబే సిఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల సమయానికి ఏమైనా మార్పులు ఉంటాయా ? పవన్ పూర్తి స్థాయిలో సమ్మతించినట్లేనా అనే విషయాలపై స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.
Also Read:జూనియర్ ఆర్టిస్ట్‌గా మారిన ఆ హీరోయిన్!