Chandrababu:బాబు హామీల వర్షం!

26
- Advertisement -

ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీల వర్షం కురిపిస్తున్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ప్రజలను ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రకటిస్తున్న హామీలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఇప్పటికే మినీ మేనిఫెస్టో పేరుతో పలు హామీలను ప్రకటించిన చంద్రబాబు జనసేన తో కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ఆల్రెడీ ప్రకటించారు. ఇక త్వరలోనే పూర్తి మేనిఫెస్టోను రూపొందించి మరిన్ని హామీలను ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. ఇక తాజాగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బహిరంగ సభలో మరోసారి హామీలను నొక్కి చెప్పారు. .

మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, తల్లికి వందనం పేరుతో రూ. 15,000, అలాగే మహిళలకు ప్రతి నెల రూ. 1500, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు రూ. 3000 భృతి.. వంటి హామీలను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తెస్తామని చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ పేరుతో ఈ హామీలను ఇప్పటికే బలంగా ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

అయితే బాబు ప్రకటించిన హామీలలో దాదాపు చాలా హామీలు కేవలం మహిళా ఓటర్లను ఆకర్శించేందుకే రూపొందించారనే టాక్ వినిపిస్తోంది. పైగా చంద్రబాబు ప్రకటించిన ఆయా హామీలు తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన హామీలతో పోలి ఉండడంతో కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో జగన్ అధికారంలోకి రాగా.. ఈసారి సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రజల్లోకి వెళుతున్నారు. మరి టీడీపీకి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

Also Read:BJP:బీజేపీలో అధ్యక్షుల మార్పు?

- Advertisement -