- Advertisement -
ఏపీలో వైసీపీ సింగిల్‌గా పోటీ చేస్తుండగా టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని బీజేపీ, జనసేన కూటమిగా వస్తున్నాయి. ఇక నామినేషన్ల పర్వం జోరందుకోగా పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది.
అయితే అసంతృప్తుల బెడద నేపథ్యంలో 5 స్థానాల్లో అభ్యర్థులను మార్చారు చంద్రబాబు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరికి, ఉండి టికెట్ రఘురామకృష్ణరాజు , మడకశిర నుండి ఎమ్మెస్ రాజు,మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణమూర్తి ,వెంకటగిరిలో రామకృష్ణకు బీ ఫారమ్‌ను అందించారు చంద్రబాబు. ఇక మరో రెండు స్థానాల్లో బీ ఫామ్‌లను పెండింగ్‌లో ఉంచారు.
ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలుండగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్,జనసేనల 21 అసెంబ్లీ ,2 పార్లమెంట్,బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది.
Also Read:ఉద్యోగాల కల్పనలో జగన్ విఫలం:షర్మిల
- Advertisement -