ఏపీకి రండి..పెట్టుబడులు పెట్టండి!

6
- Advertisement -

ఏపీకి రండి.. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పరిశీలించండి.. పెట్టుబడులు పెట్టండి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దుబాయ్ వేదికగా పెట్టుబడుల సాధనలో భాగంగా చేపట్టిన రోడ్ షోలో రాష్ట్రాన్ని ఆవిష్కరించారు సీఎం చంద్రబాబు.

రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ.. పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చేలా సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అన్నారు. ఇక దుబాయ్ నుండే ఏపీలో వర్షాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

దుబాయ్ నుంచి అధికారులతో మాట్లాడిన చంద్రబాబు.. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితులపై ఆరా తీశారు. మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి.. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, విద్యుత్ శాఖ సమన్వయంతో పనిచేయాలి అని సూచించారు.

Also Read:ఏపీ స్పీకర్‌పై జగన్ సెటైర్లు

- Advertisement -