జగన్‌ మంచిని అడ్డుకోవడమే..బాబు పనా?

18
- Advertisement -

అభివృద్ధి పాలిట విలన్, ఏ మంచినీ అంగీకరించని వైనంతో రాజకీయమే తప్ప ప్రజాసంక్షేమం పట్టకుండా న‌డుచుకుంటూ సీఎం వైయస్ జగన్ చేసే ప్రతిపనికీ మోకాలడ్డుతున్నార‌ని వైకాపా నేతలు పలుమార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేగాదు బాబు రాజ‌కీయ జీవితాన్ని ప్ర‌స్తావిస్తూ.. చంద్రబాబు తీరే అంత…ఎప్పుడూ తనకు రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తూ పని చేస్తారు తప్ప ప్రజాసంక్షేమం .ప్రయోజనాలు ఆయనకు ఏమాత్రం పట్టవని ఎన్నికల ప్రచారంలో బాబు తీరును ఎండగడుతున్నారు.

రాజకీయ నాయకులు ప్రయోజనం లేకుండా ఏ పని చేయరు అని అంటూ ఉంటారు. ఇది జనాభిప్రాయం.అయినప్పటికీ ఇందులో కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు విషయంలో కూడా ఇలాంటి విమర్శలు వినిపిస్తున్నాయి.’ఆయన రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తూ పని చేస్తారు తప్ప ప్రజాసంక్షేమం .ప్రయోజనాలు ఆయనకు ఏమాత్రం పట్టవు.ఆయన ఏ పని చేసినా అంతిమ లక్ష్యం రాజకీయ ప్రయోజనమే అనేది కొందరి వాదన.

అంతేకాదు ‘సీఎం వైయస్ జగన్ చేసే ప్రతి పనిని..ప్రతి మంచిని అడ్డుకోవడమే చంద్రబాబు రాజకీయ వ్యాపకంగా పెట్టుకున్నారు’ అని కూడా కొందరు చురకలు అంటిస్తున్నారు.ఎందుకంటే గతంలో చంద్రబాబు ‘ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి జగన్ నిశ్చయించుకుంటే’.. దానిని ఆయన వ్యతిరేకించారట. తర్వాత వాలంటీర్ల వ్యవస్థని మొదట వ్యతిరేకించి ఇప్పుడు వాలంటీర్లును కొనసాగిస్తాను..పైగా పదివేలు జీతం ఇస్తాను’ అని అంటున్నారట. అంతేకాకుండా అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీని విషయంలో , భూములకు భద్రత కల్పిస్తూ జగన్ తెస్తున్న చట్టాలను కూడా చంద్రబాబు అడ్డుకున్నారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇది అందరి అభిప్రాయం అని అనేదానికి ఎవ్వరూ సరిపోరు. చంద్రబాబు ఆలోచనలు ఎలా ఉన్నా … ఆయన పై కొంతమంది ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. చీటికిమాటికి జగన్ పై విమర్శలు వంటివి ఆయన చేయకపోతే ఇలాంటి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఆయన పై ఉండేది కాదేమో. జగన్ మాత్రం తన ప్రచారంలో ప్రత్యర్ధి పార్టీల పై విమర్శలు వంటివి చేయడం లేదు. ఆయన ఈ ఐదు ఏళ్ళు జనాలకి చేసింది ఏంటి? మరోసారి అధికారంలోకి వస్తే చేయాలనుకంటున్న డెవలప్మెంట్ ఏంటి అనే విషయం పైనే దృష్టి పెట్టారు. ఇదే జనాల్లో జగన్ పై ఉన్న నమ్మకాన్ని నిలబెడుతుంది. ఆయన్ని గెలుపు దిశగా పయనమయ్యేలా చేస్తుంది

Also Read:KCR:కొప్పుల గెలిస్తేనే మంచిర్యాల జిల్లా?

- Advertisement -