ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉండాలి: చంద్రబాబు

1
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగం అభివృద్ధి చెందుతోందని… యువకులు ఉద్యోగాలు ఇచ్చే స్థితికి ఎదగాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పుడు ప్రపంచమంతా ఏఐ (కృత్రిమ మేధస్సు) గురించి మాట్లాడుతోందన్నారు.

దావోస్ పర్యటనను ముగించుకుని రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దావోస్ కు వెళ్లాలని నిర్ణయించిన వ్యక్తి తానేనని, 1997 నుంచి అక్కడ పర్యటిస్తున్నట్లు చెప్పారు. భారత్‌కు ప్రపంచంలో బంగారు భవిష్యత్తు ఉన్నట్లు తనకు నమ్మకం ఉందని, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం కొనసాగుతోందన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆహ్వానించానని, ప్రస్తుతం తెలుగువాళ్లు ప్రపంచం మొత్తం వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని కొనియాడారు. 2028 నాటికి జీడీపీ వృద్ధిలో చైనాను అధిగమిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Also Read:అవినీతి కేసు..యోషితా రాజ‌ప‌క్స‌ అరెస్ట్

- Advertisement -