బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై చంద్రబాబు

10
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన యాభై ఏళ్ళ నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన బాలయ్య…ఇప్పటికీ అగ్రహీరోగా రాణిస్తూ, నేటి తరాన్ని కూడా అలరించే చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారు అన్నారు.

తండ్రి ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలతో పాటు అన్ని జానర్లలో నటించి తానేంటో చాటిచెప్పారు… కథానాయకుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడా రాణిస్తున్న బాలకృష్ణ మరిన్ని రికార్డులను సృష్టించి, మరెన్నో మైలురాళ్లను అధిగమించి అన్ స్టాపబుల్ గా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అన్నారు.

 

Also Read:న్యాయవ్యవస్థపై అపార నమ్మకం: సీఎం రేవంత్

- Advertisement -