Chandrababu: భవిష్యత్ అంతా టూరిజందే

2
- Advertisement -

ఏపీలో టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజులైందని, ఎంత త్వరగా అనుకున్న ప్రగతిని సాధించాలో దానికోసం ఆలోచిస్తూ ముందుకు పోతున్నామని అన్నారు. టూరిజం డెవలప్ కావాలంటే మంచి రోడ్లు కావాలి… మంచి ప్రదేశాలు కావాలి. మంచి రవాణా వసతులు కావాలి. మంచి హోటళ్లు కావాలి. ఇవన్నీ డెవలప్ చేయడానికి మేం శాయశక్తుల ప్రయత్నిస్తాం అన్నారు. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో గాడితప్పిన పరిపాలనను, దెబ్బతిన రాష్ట్ర ప్రతిష్ఠను తిరిగి సంపాదిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

ఏపీ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా దేశంలోనే తొలిసారి సీ ప్లేన్ సర్వీసులను ప్రారంభించారు. ప్రపంచంలో ఇక భవిష్యత్తంతా టూరిజందేనని, క్యాపిటలిజం. సోషలిజం… కమ్యూనిజం అన్నీ ఇజాలు పోయాయని, ఇక భవిష్యత్తులో ఒకటే ఇజం ఉంటుందని, అదే టూరిజం అని అన్నారు. ప్రపంచం మొత్తం ఇదే జరుగుతుందని చంద్రబాబు జోస్యం చెప్పారు.

రాష్ట్ర ప్రజలంతా కలిసి ఏపీని తిరిగి నిలబెట్టారు… వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ప్రజలే ఆక్సిజన్‌ ఇచ్చారు అని తెలిపారు. అతి చిన్న దేశం మాల్దీవుస్ లో సీ ప్లేన్ ద్వారా చాలా ఆదాయం వస్తుందని తెలిపారు.

Also Read:తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారు!

- Advertisement -