- Advertisement -
హైడ్రా కూల్చివేతల వెనుక ఉంది ఏపీ సీఎం చంద్రబాబేనని మండిపడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడి రేవంత్ రెడ్డి ఇక్కడినుండి పెట్టుబడులను అమరావతికి తీసుకుపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.. హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలి అంటే భయపడే పరిస్థితికి తీసుకు వచ్చారు..ఇది అంత ఒక పెద్ద కుట్ర.. రేవంత్ రెడ్డి హైదరాబాద్ డెవలప్ కాకుండా చేస్తున్నాడు అని దుయ్యబట్టారు.
మా పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. దానం నాగేందర్‌కు అనుమతించి తమను అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. ఇది ప్రజా పాలన కాదని, కంచెల పాలన అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Also Read:Kaushik: దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువ
- Advertisement -