చందాకొచ్చర్‌కు షాకిచ్చిన ఐసీఐసీఐ..!

258
chanda kochar
- Advertisement -

ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో కీ పొజిషన్‌లో ఉన్న ఐసీఐసీఐలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఈవో చందాకొచ్చార్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆమెను సెలవులపై పంపిస్తూ సందీప్‌ భక్షిని సీఈవోగా నియమించింది. వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేయడంలో ఏకపక్షంగా వ్యవహారించారనే ఆరోపణలు రావడంతో కమిటీ రిపోర్టు వచ్చే వరకు సెలవులపై వెళ్లాలని ఆదేశించింది.

ఆమె స్ధానంలో ఐసీఐసీఐ గ్రూపులోని ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎండీ, సీఈఓగా ఉన్నారు. జూన్ 19న(ఇవాళ) ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సందీప్ బక్షి 1986లో ఐసీఐసీఐ బ్యాంకులో చేరారు. 2010 నుంచి ఆగస్టు నుంచి ప్రుడెన్షియల్‌ లైఫ్‌కు సీఈవోగా పనిచేస్తున్నారు. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

Image result for sandeep bakshi icici

వీడియోకాన్ కేసులో చందా కొచ్చర్‌పై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ ఆధ్వర్యంలోని స్వత్రంత కమిటీ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాలివ్వడం ద్వారా చందా కొచ్చ‌ర్, ఆమె కుటుంబ సభ్యులు లబ్ధి పొందారన్న(క్విడ్‌ ప్రో కో) ఆరోపణలు రావడంతో బ్యాంకింగ్ రంగంలో ప్రకంపనలు మొదలయ్యాయి. అమెరికా స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ ఎస్‌ఈసీ కూడా ఈ వ్యవహారంపై రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా సెబీ ఇప్పటికే ఐసీఐసీఐ, కొచ్చ‌ర్‌లకు షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసింది.

- Advertisement -