గోపిచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చాణక్య. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించగా గోపిచంద్ సరసన బాలీవుడ్ నటి మెహ్రీన్ హీరోయిన్‌గా నటించారు. కొంతకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న గోపిచంద్ తాజా ఈ స్పై థ్రిల్లర్‌తో ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం.. ప్రివ్యూ చూసిన వాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
సినిమా చూసిన దర్శకుడు శ్రీను వైట్ల మూవీ బాగుందని కితాబిచ్చాడు. సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, చాలా బాగా తీశారని కొనియాడారు. గోపీచంద్ లుక్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని విధంగా ఉందని పేర్కొన్నారు.
సినీ రచయిత గోపీమోహన్ ,సంగీత దర్శకుడు రఘు కుంచె కూడా చాణక్యపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చాలా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందని ట్వీట్ చేశారు. మరికొంతమంది మాత్రం సినిమాలో కొత్తదనం ఏం లేదని ఎప్పటిలాగే రోటిన్‌గా ఉందని ట్విట్ చేస్తున్నారు గోపీచంద్ సక్సెస్ వేట ఇంకా ఆగలేదని సెటైర్ వేస్తున్నారు.