Ind Vs Pak: హైఓల్టేజ్ మ్యాచ్ సర్వం సిద్ధం

12
- Advertisement -

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ – పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల క్రీడా అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బంగ్లాదేశ్‌పై గెలుపుతో భారత్‌ శుభారంభం చేయగా.. న్యూజిలాండ్‌పై ఓడి పాకిస్తాన్‌ సెమిస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో పాక్‌పై పోరులో భారత్‌ విజయం సాధిస్తే మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే గ్రూప్‌-ఏ నుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్‌కు చేరుకుంటుంది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కుల్‌దీప్‌ స్థానంలో వరుణ్‌ చక్రవర్తిని జట్టులోకి తీసుకుంటారని సమాచారం.

జట్ల అంచనా :

భారత్‌ : రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్ (wk), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి

పాకిస్థాన్‌ : ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (c & wk), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్

Also Read:యూపీఐ యాప్స్‌తో పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా!

- Advertisement -