గత కొద్దిరోజులుగా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్దంలో ఉన్న ఐసీసీ కీలక ప్రకటన చేసింది. 2024-27 మధ్య ఐసీసీ మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లోనే జరగనున్నాయని వెల్లడించింది. భారత్ – పాకిస్థాన్ జట్లు.. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికలపై ఆడేందుకు అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్‌ను ప్రకటిస్తామని వెల్లడించింది.
ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు వచ్చే ఏడాది భారత్‌లో జరగబోయే మహిళల ప్రపంచ కప్, 2026లో భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే టీ 20 ప్రపంచకప్ కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహించనున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించిన తటస్థ వేదిక ఏంటనేది ఐసీసీ వెల్లడించలేదు.
2017లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగగా, ఫైనల్లో టీమ్ఇండియాను ఓడించి పాకిస్థాన్ విజేతగా నిలిచింది. ప్రస్తుతం జరగబోయే టోర్నీలో భారత్, పాకిస్థాన్‌తో పాటు మొత్తం 8 జట్లు బరిలోకి దిగనున్నాయి.
Also Read:Look Back 2024: అశ్విన్ కెరీర్‌లో హైలైట్స్ ఇవే!