స్వప్న సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన ‘ఛాంపియన్’ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.45 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. మిడ్ రేంజ్ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై నిర్మాతలు భారీ నమ్మకంతో ముందుకెళ్లారని సినీ వర్గాలు చెబుతున్నాయి. స్వప్న సినిమాస్‌కు ఇండస్ట్రీలో ఉన్న క్రెడిబిలిటీ కారణంగానే ఈ చిత్రానికి ఓటీటీ హక్కులను విడుదలకు ముందే విక్రయించగలిగారని తెలుస్తోంది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.16 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఒక మిడ్ రేంజ్ సినిమాకు ఇది మంచి డీల్‌గా ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఓటీటీ రైట్స్ ద్వారానే నిర్మాతలకు గణనీయమైన రికవరీ లభించిందని విశ్లేషిస్తున్నారు.
‘ఛాంపియన్’ హీరో రోషన్‌తో మరో సినిమాను కూడా స్వప్న సినిమాస్ ప్లాన్ చేస్తోందని సమాచారం. ఈసారి ఆ ప్రాజెక్ట్‌ను ఓ స్టార్ డైరెక్టర్ హ్యాండిల్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉండగా, ఈ నెల 24 నుంచి ‘ఛాంపియన్’ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. విడుదలకు ముందే సినిమాపై ఆసక్తి పెరుగుతుండటంతో థియేటర్ల వద్ద సందడి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రీమియర్‌లతోనే పాజిటివ్ టాక్ వస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read:BMC Polls:శివసేన–ఎంఎన్‌ఎస్ కూటమి

