Champai Soren: బీజేపీలో చేరిన చంపై సోరెన్‌

6
- Advertisement -

ఎన్నికలకు ముందు జార్ఖండ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం, జేఎంఎం మాజీ నేత చంపై సోరెన్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. చంపై సోరెన్‌కు పార్టీ కండువా కప్పారు జార్ఖండ్‌ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్‌ మరాండీ . రాంచీలో జరిగిన ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ తదితరులు హాజరయ్యారు.

జేఎంఎంకు ఇటీవలె సోరెన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని అన్నారు. గిరిజనుల సంక్షేమంతో పాటు జార్ఖండ్‌ ప్రజల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.

Also Read:బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై చంద్రబాబు

- Advertisement -