చిరు చమక్కులతో తేజు..

358
Chamak Chamak Cham (Remix) Lyrical Song
- Advertisement -

వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ఇంటిలిజెంట్’ సినిమా చేశాడు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించిన ఈ సినిమా టీజర్‌ను బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నుంచి తాజాగా ఓ పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. మెగా ఫ్యామిలీ హీరోగా సాయి ధరం తేజ్ ఇప్పటికే స్ట్రాంగ్ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. వరుస హిట్స్ నుంచి కొంచెం డీలా పడ్డ తేజు.. ఈ సారి పక్కా మాస్ సినిమా ‘ఇంటెలిజెంట్’తో రిలీజ్‌కి రెడీ అవుతున్నాడు.

Chamak Chamak Cham (Remix) Lyrical Song

అయితే మెగాస్టార్ ను కానీ.. పవన్ కళ్యాణ్ ను కానీ ఇమిటేట్ చేయడంలో ఏ మాత్రం మొహమాటపడని సాయిధరం తేజ్.. ఇంటెలిజెంట్ సినిమా కోసం మరోసారి చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ను రీమేక్ చేసేశాడు. మెగా హిట్స్ మాంచి సాంగ్స్ ను ఎంచుకుని రీమిక్స్ లతో అలరిస్తున్న ఈ హీరో.. ఇప్పుడు కొండవీటి దొంగ మూవీ నుంచి ‘చమకు చమకు చాం’ అంటూ సాగే సూపర్బ్ సాంగ్ ను తన స్టైల్ లో రీమిక్స్ చేశాడు.

మెగాస్టార్ – విజయశాంతి అప్పుడు ఈ పాటలో మెరిస్తే.. ఇప్పుడు ఆ పాటను తేజు- లావణ్య త్రిపాఠి రక్తి కట్టించినట్లుగా కనిపిస్తోంది. చమక్ చమక్ చాం లిరికల్ సాంగ్ ను విడుదల చేయగా.. ఇప్పుడీ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తమన్ రీమిక్స్ చేసిన తీరు కూడా బాగానే మెప్పించింది. మరి ఈ మూవీతో అయినా తేజు విజయం అందుకుంటాడో చూడాలి.

https://youtu.be/crci7GHuXfw

- Advertisement -