లండన్‌లో ఛలో వరంగల్ పోస్టర్ రిలీజ్

4
- Advertisement -

బీఆర్‌ఎస్‌ పార్టీ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 27 న వరంగల్ లోని ఎల్కతుర్తి లో లక్షలాది మంది తో నిర్వహించే రజతోత్సవ సభ “చలో వరంగల్ ” పోస్టర్ ను ఏన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో చారిత్రాత్మక లండన్ (టవర్) బ్రిడ్జి వద్ద ఏన్నారై బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించడం జరిగింది.

చారిత్రాత్మక రజతోత్సవ సభకు ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని ఏన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి కోరారు.మన ఇంటి పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి , పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో దేశంలోనే మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీని మనం కాపాడుకోవాలని, కెసిఆర్ నాయకత్వమే మనకు శ్రీరామా రక్షా అని నవీన్ రెడ్డి తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలంతా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని అలాగే రానున్న రోజుల్లో లండన్ లో సైతం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని నవీన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల, కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, అడ్వైసరి వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, సభ్యులు పవన్ కళ్యాణ్, అజయ్ రావు గండ్ర తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Also Read:నిద్రలేమి సమస్య…అయితే!

- Advertisement -