‘ఛల్ మోహన్ రంగ’ ట్రైలర్..

480
- Advertisement -

నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్ ఒక నిర్మాతగా వస్తున్న చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. ఈ మూవీ ట్రైలర్ ను ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో పవర్ స్టార్ చేతుల మీదుగా విడుదల చేశారు. అవుట్ అండ్ అవుట్ లవ్ బేస్డ్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తున్న ఈ మూవీలో నితిన్ మేఘా ఆకాష్ ల పెయిర్ స్క్రీన్ మీద లవ్లీగా కనిపిస్తోంది.

ఈ ట్రైలర్‌లో..‘మేఘ.. మేఘా సుబ్రహ్మణ్యం అంటూ మేఘా ఆకాష్.. ‘ఘ’ ఒత్తు పెట్టి పిలవాలంటే.. మోహన్ రంగ ఒత్తులేదు ఒత్తిగానే పిలిచేయొచ్చు అంటూ పంచ్‌లేసేస్తున్నాడు హీరో నితిన్. మేఘా ఆకాశ్, నితిన్ జంటగా ‘రౌడీ ఫెలో’ ఫేమ్ కృష్ణ చైతన్య ద‌ర్శ‌కత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను అందించారు.

Chal Mohan Ranga Theatrical Trailer

ఈ ట్రైలర్‌లో.. ఊటీలో చలేస్తే కోట్లు వేసుకోవాలి.. మగాళ్లకు బీట్లు వేయకూడదు అంటూ నితిన్ మాస్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్‌ల పలికిస్తూనే.. డాక్టర్ దగ్గరకు వెళ్లి రాత్రి 10 తరువాత మందు దొరకడం లేదు డాక్టర్ అంటూ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్‌లు పలికిస్తున్నాడు. టోటల్‌గా మేఘ ప్రేమను వెతుక్కుంటూ రంగ ఊటీకి వెళ్లడం.. ఛల్ మోహన్ రంగ అంటూ తన ప్రేయసిని దక్కించుకోవడమే చిత్ర కథ అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.

ఇక ‘ఇక్కడ నుండి వెళ్లిపో అంటూ మేఘా రంగను కోరడం… మీతో వచ్చిన ప్రాబ్లమ్ ఇదేనండి.. మీరే పట్టుకుంటారు.. మీరే వెళిపోమంటారు’ అంటూ రంగ లవ్ ఎమోషన్ డైలాగ్‌తో పిండేస్తున్నాడు. ఇక పూటుగా తాగేసి మేఘా ఉప్పెక్కడం ఫన్నీగా ఉంది.

- Advertisement -