సీఎం కేసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన చాకలి ఐలమ్మ కుటుంబం..

65
kcr

తెలంగాణ వీరనారి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందుకు, సీఎం కేసిఆర్‌కు ఐలమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ మేరకు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్వర్యంలో ఐలమ్మ వారసులు పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం, వారి కొడుకు చిట్యాల సంపత్ – చిట్యాల శ్వేత మనుమడు, మనుమరాళ్ళు ఇవాళ ప్రగతి భవన్ లో సీఎంను కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర చైర్మెన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.