టాలీవుడ్ ప్రేక్ష పక్షులు ఒక్కటైపోయారు. కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లోని ‘ఎన్ కన్వెన్షన్’లో కుటుంబ సభ్యుల మధ్య హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో ఘనంగా జరిగింది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా కూల్‌గా ఈ ఎంగేజ్ మెంట్ నిర్వహించారు. నా
నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం పొటోలను, తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజని నాగచైతన్య ట్విట్ చేశారు. నాగచైతన్య తల్లితో దిగిన పోటోతో దగ్గుబాటి ఫ్యామిలీతో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. కొత్త జీవితం ఆరంభమైందని థాంక్యూ మై లవ్ అంటు రాసుకొచ్చాడు. అటు కుటుంబ సభ్యులకు ధాంక్యూ చెప్పాడు.
ఇక నాగార్జున సైతం తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. మా అమ్మే నాకూతురు. ఇంతకు మించిన ఆనందమే ముంది! నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని ట్విట్ చేశాడు.
నాగార్జున. చైతన్యతో కలిసి నటించిన ‘ఏమాయ చేశావే’ చిత్రం ద్వారానే సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. కొంతకాలంగా వీరి ప్రేమ పెళ్లిపై మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. వీరికంటే ముందే నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో జరిగిన విషయం తెలిసిందే.