ఎప్రిల్ 5న చైసామ్ ‘మ‌జిలి’

276
Majili with title
- Advertisement -

పెళ్లి త‌ర్వాత అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత క‌లిసి న‌టిస్తున్న తొలి చిత్రం మ‌జిలి. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు రెండో లుక్ సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్. నాగ‌చైత‌న్య‌తో పాటు ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా న‌టిస్తున్న దివ్యాంశ కౌశిక్ ఈ లుక్ లో ఉన్నారు.. అది ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. ఫ‌స్ట్ లుక్ లో గ‌డ్డంతో క‌నిపించిన నాగ‌చైత‌న్య‌.. ఈ సారి మాత్రం క్లీన్ షేవ్ తో ఉన్నారు. పైగా చేతిలో క్రికెట్ బ్యాట్ ప‌ట్టుకుని చాలా స్టైలిష్ గా ఉన్నారు నాగ‌చైత‌న్య‌. దివ్యాంశ కౌశిక్ కూడా చాలా అందంగా క‌నిపిస్తున్నారు.

majili

ఈ లుక్ కు కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంది. దేర్ ఈజ్ ల‌వ్.. దేర్ ఈజ్ పెయిన్ అనే ట్యాగ్ లైన్ తో వ‌స్తున్న ఈ చిత్రం వైజాగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు శివ‌నిర్వాన‌. నిన్నుకోరి త‌ర్వాత శివ‌నిర్వాన తెర‌కెక్కిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ఈ మ‌జిలి చిత్రం. 80 శాతం షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. రావు ర‌మేష్, పోసాని కృష్ణ‌ముర‌ళి, సుబ్బ‌రాజ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. విష్ణు వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ పై సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది మ‌జిలి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎప్రిల్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

న‌టీన‌టులు:
అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావు ర‌మేష్, సుబ్బ‌రాజు, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:ర‌చ‌న‌, ద‌ర్శ‌కుడు: శివ నిర్వాన, నిర్మాత‌లు: సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది ,సంస్థ‌: షైన్ స్క్రీన్స్,సంగీతం: గోపీ సుంద‌ర్ ,సినిమాటోగ్ర‌ఫ‌ర్: విష్ణు వ‌ర్మ‌,ఆర్ట్ డైరెక్ట‌ర్: సాహి సురేష్ ,ఎడిట‌ర్: ప‌్ర‌వీణ్ పూడి,యాక్ష‌న్: వెంక‌ట్ ,పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

- Advertisement -