Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, March 11, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ఘనంగా చై, సమంతల నిశ్చితార్థం..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

ఘనంగా చై, సమంతల నిశ్చితార్థం..

January 30, 2017 4:31 AM
363
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    NAGA CHAITANYA
    - Advertisement -

    టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యువజంట ఒక్కటైపోయారు. కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్న టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ‘ఎన్ కన్వెన్షన్’లో కుటుంబ సభ్యుల మధ్య హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో ఘనంగా జరిగింది. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా చాలా కూల్‌గా ఈ ఎంగేజ్ మెంట్ నిర్వహించారు. నాగ చైతన్య, సమంత ఉంగరాలు మార్చుకున్నారు.  నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం పొటోలను, తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు నాగార్జున. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేనంటూ ట్వీట్లో రాసుకొచ్చారు.  చైస్యామ్ అనే ట్యాగ్‌తో సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ఎంగేజ్‌మెంట్‌ను ప్రకటించేశారు నాగ్‌. కాబోయే దంపతులు, అమల, అఖిల్‌, అతని కాబోయే భార్య శ్రియా భూపాల్‌లతో కలిసి తీయించుకున్న ఫొటోను నాగార్జున తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

    NAGA CHAITANYA

    మా అమ్మే నాకూతురు. ఇంతకు మించిన ఆనందమే ముంది! నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’’ అన్నారు నాగార్జున. చైతన్యతో కలిసి నటించిన ‘ఏమాయ చేశావే’ చిత్రం ద్వారానే సమంత తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. కొంతకాలంగా వీరి ప్రేమ పెళ్లిపై మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. వీరికంటే ముందే నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ నిశ్చితార్థం జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్‌తో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాదే చైతన్య, అఖిల్‌ వివాహాలు చేసేందుకు నాగార్జున సన్నాహాలు చేస్తున్నారు. అఖిల్‌ పెళ్లి ఇటలీలో, తన పెళ్లి హైదరాబాద్‌లో జరుగుతుందని చైతన్య ఇదివరకే తెలిపాడు.

    NAGA CHAITANYA

    - Advertisement -
    • TAGS
    • Chai and Samantha got engaged
    • Chaitu and Sam engagement
    • Naga Chaitanya and Samantha
    • Nagarjuna
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleలండన్‌లో అట్టహాసంగా టాక్ ఆవిర్భావ వేడుకలు….
      Next articleపంచాంగం…30.01.17
      Great Telangaana
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv