సర్వైకల్ క్యాన్సర్.. లక్షణాలివే!

31
- Advertisement -

ఇటీవల సర్వైకల్ క్యాన్సర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. బాలీవుడ్ నటి పూనం పాండే కారణంగా సర్వైకల్ క్యాన్సర్ అనేది హాట్ టాపిక్ అయింది. పూనమ్ పాండే సర్వైకల్ క్యాన్సర్ వల్ల మరణించినట్లు మొదట వార్తలు సృష్టించి ఆ తరువాత దానిపై అవగాహన తెప్పించేందుకే అలా ప్రచారం చేయించినట్లు చెప్పి దేశ వ్యాప్తంగా చర్చించుకునేలా చేసింది. దీంతో ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి ? ఇది ఎలా వస్తుంది ? దీనికి నివారణ ఏంటి ? అనే ప్రశ్నలకు సమాచారాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నారు చాలమంది. సర్వైకల్ క్యాన్సర్ అనేది మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ దీని కారణంగా ప్రస్తుత రోజుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎందుకంటే దీనిపై అవగాహన లేకపోవడం, లక్షణాలను గుర్తించకపోవడం వల్ల వ్యాది తీవ్రత పెరిగి ప్రాణాలు కోల్పోతున్నారు..

మహిళలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడినట్లు కనుగొనడానికి కొన్ని లక్షణాలను బట్టి గుర్తించవచ్చు. పీరియడ్స్ టైమ్ లో ఎక్కువగా దుర్వాసన రావడం, బ్లీడింగ్ అధికంగా ఉండడం, భార్య భర్తలు సంభోగం చేసినప్పుడు కూడా దుర్వాసన, బ్లీడింగ్ ఉండడం, మూత్ర విసర్జన చేసిన ప్రతిసారి నొప్పిగా అనిపించడం. తరచూ పొత్తి కడుపులో నొప్పి వేధించడం, వాసనను గ్రహించకపోవడం, వెన్నునొప్పి, కాళ్ళలో వాపు వంటి లక్షణాలు సర్వైకల్ క్యాన్సర్ లో ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏ మాత్రం కనిపించిన మహిళలు వెంటనే గైనకాలజిస్ట్ లను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడినప్పుడు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి తీవ్రత ముదిరిన తరువాతే దీనికి సంబంధించిన లక్షణాలు అగుపడతాయి. కాబట్టి మహిళలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి గైనకాలజిస్ట్ లను సంప్రదిస్తూ ఆరోగ్య సంబంధమైన టెస్ట్ లు చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..

- Advertisement -