ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్దంః ర‌జ‌త్ కుమార్

240
rajath kumar
- Advertisement -

డిసెంబ‌ర్ 7వ తేదిన జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్దం చేశామ‌న్నారు తెలంగాణ రాష్ట్ర ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫీస‌ర్ ర‌జ‌త్ కుమార్. ఈసంద‌ర్బంగా ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ ఓ సవాల్‌ వంటిదని, నెలరోజుల తక్కువ వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామన్నారు.

ceo

ఎన్నికల నిర్వహణ సందర్భంగా న్యాయపరంగా పలు సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు. 4ల‌క్ష‌ల 93వేల మంది ఫేక్ ఓట‌ర్ల‌ను జాబితానుంచి తొల‌గించామ‌ని చెప్పారు. పార్టీల మేనిఫెస్టోలు, ఇచ్చిన హామిల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం కూడా ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నార‌న్నారు. అభ్యర్థుల క్రిమినల్‌ రికార్డులు సేకరించామని, వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

- Advertisement -