అర్బన్ పాలసీతో పారదర్శకత:సీఎం కేసీఆర్

321
kcr assembly
- Advertisement -

అర్బన్ పాలసీ ద్వారా పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. మూడు సంవత్సరాల్లో తెలంగానలో అద్బుతం జరగబోతోందని స్పష్టం చేశారు. తెలంగాణ మున్సిపల్ చట్టంపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ పని చేయని సర్పంచ్‌లు, చైర్‌పర్సన్‌లు, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లపై చర్యలు తప్పవన్నారు.

కలెక్టర్లకు పూర్తి ధికారం ఇస్తామని చెప్పారు. . సర్పంచ్‌ని తొలగిస్తే మంత్రి ఇచ్చే స్టే అధికారాన్ని తీసేశామని వెల్లడించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ చట్టం చదువుకోవాలని కొందరికి కొత్త పురపాలక చట్టం నచ్చకపోవచ్చన్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో అధికారులు, ఉద్యోగులు పదవీ విరమణ వరకు అక్కడే పని చేస్తున్నారు. ఒకే పరిధిలో పని చేయడం వల్ల వాళ్లను ఎవరూ ఏం చేయలేకపోతున్నారు… తప్పులు చేసేవాళ్ల పట్ల శిక్షలు కూడా కఠినంగానే అమలు చేస్తామన్నారు.

అడవులు పెరగాలి.. రాష్ట్రం పచ్చదనంతో పరిఢవిల్లాలి. పట్టణాలు, పల్లెల్లో పచ్చదనం ఎలా రాదో చూస్తాం. కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ గ్రీన్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. హరితహారం లక్ష్యాలు పూర్తి చేయని ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటాం,అధికారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు.

- Advertisement -