- Advertisement -
రైతుల ఆందోళన నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు షాకిచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైతుల ఆందోళనలకు సంబంధించి హ్యాష్ ట్యాగ్‌లు,కామెంట్లు,అకౌంట్లు వెంటనే తొలగించాలని వార్నింగ్ ఇచ్చింది.
కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసినా.. ట్విటర్ దానిని అమలు చేయకపోవడంపై మండిపడింది. వాటిని వెంటనే తొలగిస్తారా లేక చర్యలు తీసుకోమంటారా అని ప్రశ్నించింది. తమ ఆదేశాలను పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది.ఐటీ శాఖ ఆదేశాల తర్వాత ఉదయం రైతుల ఆందోళనలకు సంబంధించిన 100 అకౌంట్లు, 150 ట్వీట్లను ట్విటర్ డిలీట్ చేసింది.
- Advertisement -