టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టార్‌లింక్‌కి భారతదేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు కీలకమైన అనుమతిని టెలికమ్యూనికేషన్ విభాగం (DoT), భారత ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ అనుమతితో, భారతి ఎయిర్టెల్-యూటెల్సాట్ యొక్క వన్‌వెబ్, రిలయన్స్ జియోలతో పాటు స్టార్‌లింక్ కూడా దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించే అధికారిక సంస్థల జాబితాలో చేరింది. వాణిజ్య పరంగా సేవల ప్రారంభం స్పెక్ట్రం కేటాయింపు తర్వాతనే జరగనుంది.
గ్రామీణ ప్రాంతాలు, కొండప్రాంతాలు, లేదా సాధారణ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కష్టమైన చోట్ల ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో కీలకంగా ఉంటుందని చెప్పారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. 2021లో స్టార్‌లింక్ భారత్‌లో తన సేవలు ప్రారంభించేందుకు ప్రయత్నించగా, కొన్ని నిబంధనల కారణంగా ఆ ప్రయత్నాన్ని నిలిపివేసి ముందస్తు బుకింగుల కోసం తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాల్సి వచ్చింది. తాజా అనుమతితో, భారత మార్కెట్‌లో మళ్లీ సీరియస్ ఎంట్రీ ఇచ్చేందుకు స్టార్‌లింక్ సిద్ధమవుతోంది. అమెజాన్ ప్రాజెక్ట్ కుయిపర్ ఇంకా అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.
గతంలో ఫిక్స్‌డ్ లైన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మొబైల్ కనెక్టివిటీ, బ్రాడ్‌బ్యాండ్, ఆప్టికల్ ఫైబర్ ఉన్నాయి. వీటితో పాటు శాటిలైట్ కనెక్టివిటీ కూడా ఎంతో ముఖ్యం అన్నారు. స్పెక్ట్రం కేటాయింపుపై దృష్టి సారించిన తరువాత, భారత్‌లో శాటిలైట్ టెలికాం సేవలు వేగంగా విస్తరించనున్నాయని చెప్పారు.ఈ GMPCS లైసెన్స్‌తో, తక్కువ ఎత్తులో భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలతో (Low Earth Orbit Satellites) శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారతదేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. ఇది డిజిటల్ విభజనను తగ్గించేందుకు మరియు కనెక్టివిటీని విస్తృతంగా పెంచేందుకు కీలకంగా మారనుంది.
Also Read:ఉద్యోగుల డీఏ సంగతేంటి?:హరీష్

