చంద్రబాబుకు షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం..

245
chandra babu sad image
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు మేరకు ఏపీలో అధికారులపై వేటు వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర్‌రావు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఏబీ వెంకటేశ్వర్ రావుతో పాటు కడప ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మతో, శ్రీకాకుళం ఎస్పీని ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

త్వరలో జరిగే ఎన్నికల విధుల్లో ఏబీ వెంకటేశ్వర్ రావు పాల్గోనవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈసందర్భంగా ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈసీ తీసుకున్న నిర్ణయం పై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్ నియామకంపై సీసియర్ అధికారుల జాబితాను రెడీ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు ఏపీ డిజిపి.

డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్‌, చిత్తూరు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, గుంటూరు రూరల్‌ ఎస్పీ రాజశేఖర్‌, శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం, విజయనగరం ఎస్పీ దామోదర్‌, అడిషనల్‌ సీఈవో సుజాత శర్మ, ఓఎస్‌డీ యోగానంద్‌లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సోమవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీకీ మద్దతు పలుకుతున్న ముగ్గురు అధికారులపై వేటు వేసింది ఈసీ.

- Advertisement -