మేనిఫెస్టో ప్రకటనపై కొత్త నిబంధనలు పెట్టిన ఎన్నికల సంఘం

222
Election-commission
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే రంగంలోకి దిగిపోయాయి. అభ్యర్ధుల ఖరారు, మ్యానిఫెస్టో ప్రకటనల్లో బిజీగా ఉన్నారు పార్టీల అధినేతలు. అయితే గత ఎన్నికల వరకూ రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టో విషయంలో ఎటువంటి నిబంధనలే పెట్టలేదు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం మేనిఫెస్టోపై కొత్త పద్దతిని తీసుకువచ్చింది. పోలింగ్ కు 48గంటల ముందే రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మేనిఫెస్టోల విడుదలను కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళిలో చేర్చుతూ ప్రజాప్రాతినిధ్య చట్టం 1956లోని సెక్షన్‌ 126 కింద నిర్ణయం తీసుకొంది. ఈ సెక్షన్‌ ప్రకారం పోలింగ్‌ తేదీకి 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది.

గతంలో మేనిఫెస్టో విడుదలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో తాజాగా ఈనిబంధనలు తీసుకువచ్చింది. మేనిఫెస్టో ప్రకటనపై పలు పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేయగా తాజాగా ఈసి ఈనిర్ణయం తీసుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్‌ రోజునే బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఎన్నికల రోజు మ్యానిఫెస్టో ను ప్రకటించడం ఓటర్లను ప్రభావితం చేసేట్టుగా ఉందంటూ అప్పుడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై ఈసి ఓ కమిటిని నియమించగా..72గంటల ముందు మేనిఫెస్టోను విడుదల చేయాలని సిఫార్సు చేసింది. ఈసీ మాత్రం రెండు రోజులకే దీనిని పరిమితం చేసింది. ప్రచారం ముగిసిన తర్వాత ఎన్నికల అంశాలకు సంబంధించి రాజకీయ నాయకులు, స్టార్ క్యాంపెయినర్లు మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరాదని స్పష్టం చేసింది.

- Advertisement -