KTR:అభివృద్ధి కోసం కేంద్రం సహకరించాలి

53
- Advertisement -

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా పలు వినతి పత్రాలు అందజేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…గడిచిన 9యేళ్ల కాలంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గుండు సున్నా అని అన్నారు. తెలంగాణ సాధించి దశాబ్దం జరిగినందు వల్ల రాష్ట్రంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఐటి, ఏరో స్పేస్, డిఫెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఇలా అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్న హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం కేంద్ర సహకరించాలని అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని అయినా పట్టించుకోవడం లేదన్నారు. విస్తరిస్తున్న నగర జనాభాకు అనుగుణంగా నగరంలో స్కైవేల నిర్మాణం కోసం అనేక సార్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులు మారుతున్నారే కానీ కేంద్ర వైఖరి మారడంలేదన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు.

జూబ్లి బస్టాండ్‌ నుంచి రాజీవ్‌ రహదారి వరకు, అలాగే ప్యారడైస్‌ నుంచి మేడ్చల్‌ ఓఆర్ఆర్ వరకు స్కైవే నిర్మాణం కోసం కేంద్ర రక్షణ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. రాజీవ్‌ రహదారి నుంచి 96ఎకరాల భూమి, మేడ్చల్‌ నుంచి 56ఎకరాల భూమి ఇస్తే..దానికి విలువైన సమానమైన భూమిని ఇస్తామని చెప్పిన స్పందన లేదన్నారు. ఉప్పల్‌ నిర్మించిన స్కైవాక్‌ పూర్తైందని కానీ రక్షణ శాఖ పరిమితుల వల్ల మెహదీపట్నంలో మాత్రం స్కైవాక్‌ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్నారు. కంటోన్‌మెంట్లో నిరుపయోగంగా ఉన్న భూములను జీహెచ్‌ఎంసీకి ఇస్తే అక్కడ ప్రజలకు అవసరమైన ఆస్పత్రులు కమ్యూనిటీ హాలులు నిర్మాణం చేస్తామని కోరాం. గోల్కొండ, ఇబ్రహీంబాగ్‌ లింకు రోడ్ల కోసం అవసరమైన భూమిని అడిగిన రక్షణ ఇవ్వడం లేదన్నారు.

రేపు పట్టాణభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్‌పూరిని కలవనున్నట్టు తెలిపారు. లక్డికపూల్‌ నుంచి బీహెచ్‌ఈఎల్‌ వరకు మెట్రో విస్తరణ, నాగోల్ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో విస్తరణ కోసం విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. పటాన్‌ చెరు నుంచి హయత్‌ నగర్‌ వరకు మెట్రో విస్తరణకు కూడా కేంద్రం చొరవతీసుకోవాలన్నారు. ఇప్పటికే అనేకసార్లు ఈ ఆంశంలో డీపీఆర్లు ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఎంఎంటీఎస్‌కు నిధులను చెల్లించినా కేంద్రం నుంచి స్పందన కరువైందన్నారు. ఎస్‌ఆర్డీపీ కింద అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేశామని తెలిపిన మంత్రి కేటీఆర్‌…రసూల్ పురా వద్ద మూడు నాలుగు ఎకరాల హోంశాఖ భూమి అందిస్తే అక్కడ ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందన్నారు. ఈ విషయంలో కిషన్ రెడ్డికి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చిన పట్టించుకోవడం లేదని తెలిపారు.

ఉత్తరప్రదేశ్‌లో 10చిన్న పట్టణాలకు మెట్రోలు ఇచ్చిన కేంద్రం హైదరాబాద్‌ మెట్రోకు ఎందుకు సహకరించడంలేదన్నారు. కేంద్రం ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న ద్రోహాన్ని కొనసాగిస్తుందని అన్నారు. ప్రధాని మోదీ అవకాశం ఇస్తే ఢిల్లీని గుజరాత్‌కు తీసుకెళ్లుతారని అన్నారు. 75ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని అభివృద్ధి చేయడంలో జాతీయపార్టీలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ఇప్పటికీ విద్యుత్, నీటి సరఫరాలేని గ్రామాలు కూడా దేశంలో ఉన్నాయంటే వీటి బాధ్యత పూర్తిగా ఈ రెండు జాతీయ పార్టీలదే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని తెలంగాణ అభివృద్ధిని నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు. నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్‌ స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన విషయం అందరికీ తెలుసని అన్నారు.

Also Read: Bharat:మైనార్టీ హక్కులపై మోదీ స్పందన..

దేశంలో ఎప్పటిదాకా పనిచేసిన ప్రధాన మంత్రుల్లో కెళ్లా అత్యంతా బలహీనమైన ప్రధానిగా మోదీ ఉంటారని స్పష్టం చేశారు. సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకంగా కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మేం దాన్ని వ్యతిరేకిస్తామని మంత్రి కేటీఆర్ మీడియా ముఖంగా తెలిపారు. ఢిల్లీలో తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతరేకంగా నిలబడతామని అన్నారు. సమాఖ్య స్పూర్తికి వ్యతిరేకమైన ఈ ఆర్డినెన్స్‌ తేస్తే కాంగ్రెస్‌ ఏ విధంగా సపోర్ట్‌ చేస్తుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కిషన్ రెడ్డిది అమాయకత్వమో, అజ్ఞానమో తెలయదని…ప్రజెంటేషన్‌లో ప్రజలకు ఇచ్చిన అప్పును కూడా కేంద్రం ఇచ్చిన నిధులుగా చూపించారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

Also Read: CMKCR:జై తెలంగాణ.. జైజై తెలంగాణ

- Advertisement -