ప్రతీకారం తీర్చుకోవాల్సిందే..!

12
- Advertisement -

ఉగ్రదాడిని ఖండించారు సినీ ప్రముఖులు. వారిపై ప్రతీకార చర్య తీసుకోవాల్సిందేనని ముక్త కంఠంతో తేల్చిచెప్పారు. ఎందరో అమాయకులను బలిగొన్న దారుణమైన ఈ దాడి హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. వారి నష్టం తీర్చలేనిది అంటూ మెగాస్టార్ చిరంజీవి విచారం వ్యక్తం చేశారు.

– బాధితులను చూస్తుంటే నా హృదయం బరువెక్కుతోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. శాంతి కోసం ప్రార్థిస్తున్నా – జూనియర్ ఎన్టీఆర్‌

Also Read:TTD:తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు

-ఇది క్షమించరాని చర్య. ఈ ఉగ్ర చర్యపై అందరూ మౌనం వీడండి. వారిపై ప్రతీకారం తీర్చుకోవాలి. వారికి తగినవిధంగా బుద్ధి చెప్పాలి – సంజయ్‌దత్‌

-ఈ దాడి భయంకరమైనది. అమాయకులను చంపడం చాలా దారుణం. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా”- అక్షయ్‌ కుమార్‌

-అమాయక పర్యటకులపై జరిగిన పిరికిపంద ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. నాగరిక ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు ఉండకూడదు. ఈ దుర్మార్గపు చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు”- సోనూసూద్‌

- Advertisement -