బన్నీ అన్న నీ సినిమా కోసం ఆతృతగా ఎదురుచేస్తున్నా.. వరుణ్

1130
Celebrities Birthday Wishes to Allu Arjun
- Advertisement -

నేడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా అయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఈ ఏడాది సంతోషంగా, గొప్పంగా ఉండాలని ప్రముఖులు, ఫ్యాన్స్ కోరుకుంటున్నటు తెలిపారు. దిల్‌రాజు, హరీష్‌.. బన్నీను స్వయంగా కలిసి విష్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

బన్నీ అన్న.. జన్మదిన శుభాకాంక్షలు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమాలో నీ లుక్స్ సూపర్బ్. లాట్స్‌ ఆఫ్‌ లవ్ అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు. వన్‌ ఇండియా.. పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ. ఈ ఏడాది నీకు విజయవంతంగా, గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్లు సాయిధరమ్ తేజ్ తెలియజేశారు.
లావణ్య త్రిపాఠి: ‘జన్మదిన శుభాకాంక్షలు అల్లు అర్జున్‌. గ్రేట్‌ ఇయర్‌ ఎ హెడ్‌’.

 Celebrities Birthday Wishes to Allu Arjun

బన్నీబాబు అలియాస్‌ సూర్యకు హ్యాపీ బర్త్‌డే అంటూ మారుతి తెలియజేశారు. మేమిద్దరం కలిసి ఒకేసారి లుంగీ ధరించే అవకాశం వచ్చింది.. భలే సరదాగా గడిచిపోయింది.. దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా సెట్‌లో చాలా సరదాగా ఉన్నాం. పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్‌. ఈ ఏడాది నీకు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’.

అల్లు అర్జున్ తాజా చిత్రం వక్కంతం దర్శకత్వంలో నాపేరు సూర్య చేస్తున్న సంగతి తెలిసింది, నేడు ఆయన బర్త్ డే సందర్బంగా డైలాగ్ ఇంపాక్ట్ కూడా రిలీజ్ చేశారు. ఈ డైలాగ్ బన్నీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం మే 4న రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తుంది.

- Advertisement -