సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన సినీ తారలు

278
celebrates Tweet Happy Pongal
- Advertisement -

ప్రజలంతా సంక్రాంతి పర్వదినాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటున్నారు. ఎటు చూసినా పతంగులు, రంగవల్లులు, గొబ్బెమ్మలతో లోగిళ్లు కళకళలాడుతున్నాయి. ఎంత బిజీగా ఉన్నా.. మేమూ మీలాగే సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతున్నామంటూ అభిమానులకు సోషల్‌ మీడియా ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నారు సినీ ప్రముఖులు.

హీరో అక్కినేని నాగార్జున… సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పడంతో పాటుగా, తన నివాసంలో వేసిన ముగ్గు దగ్గర సతీమణి అమలతో పాటు దిగిన ఫోటోను ట్విట్‌ చేశారు. మా ఇంటి ముందు వేసిన ముగ్గుచూశారా అంటూ నాగార్జున ట్వీట్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్త పరిచారు.

celebrates Tweet Happy Pongal

సినీ తారల సంక్రాంతి ట్వీట్లు…..

మీకు మీ కుటుంబ సభ్యులకు సంకాంత్రి శుభాకాంక్షలు- దగ్గుబాటి వెంకటేశ్‌

హ్యాపీ సంక్రాంతి – సునీల్‌

మీకు మీ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు – కాజల్‌ అగర్వాల్‌

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీర్వాదాలు అందరికీ ఎల్లప్పుడూ ఉంటాయి.- అమితాబ్‌ బచ్చన్‌

ఈ పండుగ వాతావరణంలో అందరూ సంతోషంగా ఉండాలి. హ్యాపీ సంక్రాంతి – సమంత

హ్యాపీ సంక్రాంతి- లావ్యణ్య త్రిపాఠి

అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు -ఎన్టీఆర్‌

ఇక వీరితో ప్రిన్స్‌ మహేష్‌ బాబు … ‘మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ ట్విట్‌ చేశాడు. సాయిధరమ్‌ తేజ, మంచు మనోజ్‌, వెన్నెల కిషోర్‌, ప్రియమణి, కల్యాణ్‌ రామ్‌, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తదితరులు ట్విట్‌ చేశారు.

- Advertisement -