పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ భారతీయ జనతా పార్టీ, నవంబర్ 8ని నల్లధన వ్యతిరేక దినంగా పాటించడం జరిగింది. ఈ సందర్భంగా, అమెరికా సంయుక్త రాష్ట్రాలోని వివిధ నగరాల్లో నల్లధన వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భముగా, అనేక ప్రదేశాల్లో చాయ్ పే చర్చ , కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
ఓఎఫ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ కృష్ణ రెడ్డి అన్నగుల మాట్లాడుతూ, ” పెద్దనోట్ల రద్దుతో, దేశాన్ని సుదీర్ఘ కాలం పట్టిపీడిస్తున్న చీడపురుగులు నల్లధనం, అవినీతి, ఉగ్రవాదంపై గట్టి దెబ్బ తగిలింది. డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు ద్వారా విప్లవాత్మకమైన ప్రయోజనాలు చేకూరుతున్నాయి.” అని తెలిపారు.
ఓఎఫ్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు , శ్రీ అడపా ప్రసాద్ మాట్లాడుతూ, ” అవినీతి, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, నల్లధనం, నకిలీనోట్లపై సర్జికల్ స్ట్రైక్, నోట్లరద్దు ,” అని స్పష్టం చేశారు.
ఓఎఫ్ బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ వాసు దేవ్ పటేల్ మాట్లాడుతూ, “పన్ను చెల్లింపు సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశంలో దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న భారతీయ ఆర్థిక వ్యవస్థను శుభ్రపరచడంలో నోట్ల రద్దు సహాయపడింది. ” అని తెలిపారు.
ఓఎఫ్ బిజెపీ కార్యవర్గ సభ్యులు శ్రీ కల్పనా శుక్ల , ఓఎఫ్ బిజెపీ జాతీయ యువ సహా -కన్వీనర్, శ్రీ విలాస్ రెడ్డి జంబుల , ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ కోర్డినేటర్ శ్రీ అరవింద్ పటేల్ , ఓఎఫ్ బిజెపీ న్యూ జెర్సీ కో-కోర్డినేటర్ శ్రీ ఆనంద్ జైన్ , ఓఎఫ్ బిజెపీ మీడియా కో-కన్వీనర్ శ్రీ దిగంబర్ ఇస్లాంపురే, శ్రీ వంశీ యంజాలమరియు ఇతర ఓఎఫ్ బిజెపీ నేతలు శ్రీ అల్పేష్ పటేల్ , శ్రీ ప్రణవ్ పటేల్ గారు న్యూ జెర్సీ పట్టణం లో జరిగిన నల్లధన వ్యతిరేక దినోత్సవంలో పాల్గొన్నారు.