కరోనా నేపథ్యంలో సినీ రంగానికి సంబంధించిన సమస్యలను చర్చించేందుకు టాలీవుడ్ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ,ఎన్ శంకర్,సి కల్యాణ్,బెనర్జీ తదితరులు హాజరయ్యారు.
ప్రధానంగా బాలకృష్ణ కామెంట్స్,నాగబాబు కౌంటర్ కామెంట్స్‌తో పాటు సినీ కార్మికులకు రెండో విడత సాయంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి కూడా స్పందించే అవకాశమున్నట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరుగుతున్నట్లు తనకు తెలియదని…అందరూ కలిసి హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా..అని బాలయ్య సెటైర్లు వేశారు. దీనిపై స్పందించిన నాగబాబు..ఇండస్ట్రీ బాగు కోసం పని చేస్తున్నారు తప్ప… భూములు పంచుకోవడానికి ఎవరూ వెళ్లలేదన్నారు. ఇండస్ట్రీపై మీకున్న గౌరవం ఇదేనా? తప్పుగా మాట్లాడారు. మీరు చిత్రపరిశ్రమను మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించారని నాగబాబు…బాలయ్యపై కౌంటర్ ఎటాక్ చేశారు.