కార్తీ చిదంబరాన్ని ముంబై తరలించిన సీబీఐ..

234
CBI takes Karti Chidambaram to Mumbai
- Advertisement -

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరాన్న సీబీఐ అరెస్ట్ చేసింది సంగతి తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ప్రస్తుతం ఆర్థిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని విచారిస్తున్న సీబీఐ అధికారులు, తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను ముంబై తరలించారు. ఐఎన్ఎక్స్ మీడియాలో రూ. 300 కోట్ల విదేశీ పెట్టుబడులకు అనుమతి కోసం తాను, పీటర్ ముఖర్జియా కలసి అప్పటి ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిశామని, తన కుమారుడి కంపెనీకి సహకరించాలని ఆయన కోరాడని ఇంద్రాణి ముఖర్జియా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణలో అంగీకరించిన నేపథ్యంలోనే కార్తీని ముంబై తరలించినట్టు సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

CBI takes Karti Chidambaram to Mumbai

ప్రస్తుతం మూతపడ్డ ఐఎన్ఎక్స్ మీడియా కార్యాలయానికి కార్తీని తీసుకెళ్లి విచారించనున్నామని, ఈడీ అధికారులు కూడా ఈ విచారణకు హాజరవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, తన కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని, అందువల్లే తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చిదంబరం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరాన్ని సైతం ప్రశ్నించేందుకు సీబీఐ నోటీసులను సిద్ధం చేసిందని సమాచారం.

ఫిబ్రవరి 2న మనీలాండరింగ్ కేసులో అధికారులు ఆయనకు సమన్లు జారీ చేశారు. కార్తీ చిదంబ‌రంతో స‌న్నిహితుల ఇళ్ల‌పై ఇటీవ‌లె దాడులు నిర్వ‌హించిన ఈడీ మూడు ప్రాంతాల్లో సోదాలు చేప‌ట్టింది. ఇప్పటికే రెండుసార్లు ఈడీ ముందుకు కార్తీ హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మద్రాసు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులోనూ కార్తి పిటిషన్లు వేశారు.

- Advertisement -