- Advertisement -
ఈఎస్ ఐ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుంది. ఈకేసులో మరికొన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా చెన్నై కి చెందిన డాక్టర్ అరవింద్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. అలాగే అరవింద్ రెడ్డి ఇంటిపై ఎసిబి సోదాలు నిర్వహిస్తున్నారు. అరవింద్ రెడ్డి ఈ ఎస్ ఐ హాస్పిటల్లో అధికారులతో పరిచయాలు పెంచుకున్నట్లు తెలుస్తుంది.
బాలానగర్ లోని అతని కంపెనీలో సోదాలు చేస్తున్నారు. అరవింద్ రెడ్డి అనే వ్యక్తి మందుల సప్లయర్ గా పనిచేస్తుంటాడు. హెల్త్ క్యాంపు పేరిట ఈ.యస్.ఐ నుండి మెడిసిన్ తీసుకున్న అరవింద్ రెడ్డి సర్జికల్, జనరల్, హెచ్ఐవి, వాటికి ఇతర మెడిసిన్ తీసుకొని వాటిని క్యాంపులకు ఉపయోగించకుండా బయట అమ్ముతున్నట్లుగా నిర్ధారించారు ఏసీబీ అధికారులు .
- Advertisement -