సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా..!

414
CBI officer JD Laxminarayana resigns
- Advertisement -

అవినీతి పరుల గుండెల్లో గుబులు పుట్టించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీబీఐ మాజీ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ గురించి అందరికి తెలిసిన విషయం తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు కీలక కేసులను ఎలాంటి రాజకీయాలకు తలొగ్గకుండా పరుగులు పెట్టించారు. ప్రస్తుతం ఆయన ముంబై అడిషనల్ డీజీపీగా పనిచేస్తుండగా తన పదవికి రాజీనామా చేశారన్న వార్తలు వెలువడుతున్నాయి.

అయితే తన పదవికి రాజీనామా చేసినట్లు అధికారికంగా ఆయన కానీ,అధికార వర్గాలు కానీ ధృవీకరించలేదు. త్వరలో రాజకీయాల్లోకి వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే తన పదవికి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

తెలుగు వ్యక్తి అయిన లక్ష్మీనారాయణ ఐపీఎస్ ఆఫీసర్‌గా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. సత్యం కుంభకోణం లాంటి పలు కీలక కేసులను చేపట్టి.. నిర్భయంగా దర్యాప్తు పూర్తి చేసి వార్తల్లో నిలిచారు.

- Advertisement -