సెన్సార్ కత్తెరకి బలై పోయింది..!

208
CBFC orders 48 cuts for Babumoshai Bandookbaaz
- Advertisement -

బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో ఎక్కువగా శృంగార భరిత చిత్రాలే వస్తున్నాయి. సినిమా ఎలాంటిదైనా సరే అందులో బెడ్ రూమ్,బాత్ రూమ్ సీన్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. హీరో,హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు, శరీరాన్ని ఎక్కడపడితే అక్కడ తాకేలా రెచ్చిపోవడం ఇలా కుర్రకారు మతులు పోగొడుతున్నారు. తాజాగా నవాజుద్దీన్ సిద్దికీ,అర్మాన్ మాలిక్ నటించిన చిత్రం బాబూ మోషయ్ బందూక్ బాజ్.

ఇప్పుడీ సినిమా బీ టౌన్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. కారణం విపరీతంగా బూతు కంటెంట్ ఉండటమే. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆ సీన్లను దట్టంగా వడ్డించారట. అందుకే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ సినిమాకి 48 సెన్సార్‌ కట్స్‌ పడ్డాయట.

మొత్తంగా 48 సన్నివేశాల్ని సినిమా నుంచి లేపెయ్యడమంటే, అది చిన్న విషయం కాదు. అయితే సన్నివేశం మొత్తాన్నీ లేపెయ్యలేదనీ, సన్నివేశాల్లోని అసభ్యకరమైన దృశ్యాల్ని, అభ్యంతకర దృశ్యాల్ని మాత్రమే ‘కట్‌ చేసినట్లు’ సెన్సార్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై ‘బాబుమొషాయ్‌’ చిత్ర దర్శక నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

‘సినిమా అనేది కళాత్మకమైన వ్యవహారం. అందులోని కళాత్మక కోణాన్ని పక్కన పెట్టి ఇష్టమొచ్చినట్లు కట్‌ చేసుకుంటూ పోతే, సినిమా ఎందుకు.?’ అన్నది ‘బాబూమొషాయ్‌’ టీమ్‌ వాదన. అసభ్యకర దృశ్యాల్లో నటించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బిదితా బేగ్‌ సైతం సెన్సార్‌ బోర్డ్‌ తీరుని తప్పు పడ్తోంది. ఏదిఏమైనా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాతో బీ టౌన్‌ షేకవడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

https://youtu.be/8Bakp3UKa3c

- Advertisement -