కత్తిపట్టిన… లేడి ఎమ్మెల్యే

368
Catherine Tresa Latest Photos going Viral
- Advertisement -

ఇద్దరమ్మాయిలతో .. ‘సరైనోడు’.. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కేథరిన్. సరైనోడులో ఎమ్మెల్యేగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ,మలయాళ ,కన్నడ సినిమాల్లోనూ వరుసగా సినిమాలతో దూసుకుపోతోంది. అందం అభినయం రెండు ఉన్నా సినిమా పరిశ్రమలో అదృష్ణం కలిసి రావాలంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే అందాల భామ కేథరిన్‌కు ఎదురవుతోంది.

గ్లామర్ పరంగా ఈ సుందరికి ఫుల్ మార్క్స్ పడిపోతున్నాయి గానీ, నటన విషయంలో ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోతోంది. దీంతో రెండవ కథానాయికగానే అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేథరిన్‌ గ్లామర్ డోస్ పెంచేయడమే కాకుండా, స్పెషల్ సాంగ్స్ కి ప్రాధాన్యతనిస్తోంది. ఆమె చేస్తోన్న స్పెషల్ సాంగ్స్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ లేడి ఎమ్మెల్యే ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కత్తి పట్టిన కేథరిన్‌..స్ల్మైలీ లుక్‌లతో అదరగొట్టింది.

catherine

ప్రస్తుతం కన్నడ సూపర్‌ హిట్ కిరిక్‌ పార్టీకి రీమేక్‌ గా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది కేథరిన్. యంగ్ హీరో నిఖిల్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై కేథరిన్ భారీ ఆశలే పెట్టుకుంది. మరి ఈ సినిమాతోనైనా కేథరిన్..మంచి మార్కులు కొట్టేస్తుందా లేదా చూడాలి.

- Advertisement -