డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాలు ఎంత స్టైలిష్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతటి స్టార్ హీరో సినిమా అయిన తక్కువ కాలంలోనే పూర్తి చేసి మంచి అవుట్ పుట్ ఇస్తాడు. రీసెంట్గా మెహబూబా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న పూరి, మళ్లీ మెగాఫోన్ బాట పట్టనున్నాడు.
ఈ నేపథ్యంలో పూరి కనెక్ట్స్ సంస్థలో తెరకెక్కబోయే తర్వాతి చిత్రం కోసం కాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు దర్శక నిర్మాతలు. చూడటానికి అందంగా కనిపిస్తూ.. నటనలో మెళకువలు తెలిసిన 18 నుంచి 23 మధ్య వయసున్న అమ్మాయిలకు అవకాశం కల్పిస్తున్నామని టాలెంట్ ఉన్నవారు పూరి కనెక్ట్స్ ఆఫీస్‌ను సంప్రదించాలన్నారు.
తన తనయుడు ఆకాశ్ హీరోగా చేయనున్న సినిమాకి సంబంధించిన పనులను పూరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే.. రామ్ తో నయా మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఆకాశ్ హీరోగా చేస్తున్న చిత్రం ద్వారా అనిల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.