హైదరాబాద్‌లో జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మార్చి 15న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరుకావడంతో పరిస్థితి అదుపు తప్పింది.
పోలీసులు ముందుగా కేవలం 1,500 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే, అంచనాలకు మించి 5,000 మందికిపైగా అభిమానులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఏర్పడ్డాయి. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి యూసుఫ్‌గూడ వైపు వెళ్లే ప్రధాన రహదారులన్నీ గంటల పాటు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించారని గుర్తించిన జూబ్లీహిల్స్ పోలీసులు ఈవెంట్ ఆర్గనైజర్‌పై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం, అధికారుల ఆదేశాలను ఉల్లంఘించడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువగా జన సమీకరణ జరగడం, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వంటి అంశాలు పోలీసుల దృష్టికి వచ్చాయి.
ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read;వినూత్నంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్

