యూట్యూబ్, పేస్ బుక్, ట్విట్టర్.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే ట్రేండింగ్. మలయాళి పిల్ల ప్రకియ ప్రకాష్ వారియర్ గురించే చర్చంతా. వాలెంటైన్స్ డేకి రెండు రోజుల ముందుగా ఓరు అడార్ లవ్ చిత్రానికి సంబందించిన ఓ వీడియోని విడుదల చేశారు. ఆ పాటలో ప్రియా వారియర్ కన్నుగీటిన విధానం, ఆమె హావభావాలు కురాళ్ళ హృదయాలు మటాష్ అయిపోయాయి. అంతేగాదు ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోంది.
అయితే తాజాగా ప్రియా వారియర్ వివాదంలో చిక్కుకుంది. ఈ పాటపై హైదరాబాద్ ఫరూక్ నగర్‌కు చెందిన కొంత మంది ముస్లిం యువకులు ఫలక్‌నుమా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ జరిగిందని, ప్రియా ప్రకాశ్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ వారు తమ లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆమె ఒక ట్రెండింగ్. తన కొంటె చూపులతో కుర్రకారు మనసులను అమాంతం దోచేసింది. లక్షలాది మంది యువతీ యువకులు ఈ వీడియోను తమ వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు. అంతేగాదు గూగుల్ సెర్చ్‌లో ఇప్పటివరకూ అత్యధికంగా బాలీవుడ్ హాట్‌బ్యూటీ సన్నీలియోన్ టాప్‌లో ఉండగా, తాజాగా సన్నీని ప్రియా ప్రకాష్ దాటేసింది. అంతేగాదు ప్రియా ధాటికి కత్రినా కైఫ్, అనుష్క శర్మ, దీపికా పదుకోన్‌లూ గూగుల్ సెర్చ్‌లో వెనుకపడ్డారు.