నటి జ్యోతికపై పోలీస్‌ ఫిర్యాదు..

236
Case against Jyothika for using abusive Language
- Advertisement -

నటి జ్యోతికపై హిందూ మక్కళ్‌ కట్చి నేతలు పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం నాచియార్‌. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలపై ఇంతకు ముందే తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పలు సంఘాల వ్యతిరేకతతో ఆ సన్నివేశాల్లోని సంభాషణలను చిత్ర వర్గాలు బీప్‌ చేశారు. ఈ నేపథ్యంలో నాచియార్‌ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదల అయింది.

Case against Jyothika for using abusive Language

అయితే, ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ‘మాకు ఆలయాలైనా, చెత్తకుప్పలైనా ఒక్కటే’ అనే డైలాగ్ ఉంది. జ్యోతికకు చెందిన ఈ డైలాగ్ పై హిందూ మక్కళ్ కట్చి నేతలు మండిపడ్డారు. ఈ సంభాషణలు హిందూ దేవాలయాలను, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు సంభాషణలను వెంటనే తొలగించాలని… జ్యోతిక, దర్శకుడు బాలాపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

- Advertisement -