బంగ్లాదేశ్ తో ఇండియా మూడు టీ20మ్యాచ్ లు ఆడనుంది. ఇందులో భాగంగా నిన్న ఢిల్లీ వేదికగా మొదటి మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్ లో బంగ్లాదేశ్ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిన్న బంగ్లాదేశ్ తో ఓటమిపై స్పందించారు కెప్టెన్ రోహిత్ శర్మ. ఫీల్డింగ్ వైఫల్యం వల్లే తమ జట్టు ఓటమిపాలయ్యిందని చెప్పారు.
తాము చేసిన స్కోరు తక్కువేమి కాదన్నారు. మ్యాచ్‌ను గెలిచేందుకు వీలుండే లక్ష్యాన్నే బంగ్లాదేశ్ ముందుంచామని చెప్పుకొచ్చాడు. బంగ్లా బ్యాట్స్ మెన్ ముష్పికర్ రహీమ్ ను అవుట్ చేసే అవకాశాలు తమకు రెండు సార్లు వచ్చినా వాటిని మిస్ చేసుకున్నట్లు తెలిపారు.
బ్యాటింగ్ చేస్తున్నప్పటి నుంచీ ఒత్తిడికి గురయ్యామని, జట్టులో అనుభవం లేని ఆటగాళ్లు కూడా ఉన్నారని చెప్పారు. టీ20ల్లో యజ్వేంద్ర చహల్ మిడిల్ ఓవర్లలో బౌలింగ్‌తో ముఖ్య పాత్ర పోషిస్తాడని ప్రశంసించాడు. కాగా నిన్నటి మ్యాచ్ తో బంగ్లాదేశ్ 1/0 ఆధిక్యంలో కొనసాగుతుంది.