టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌..

46
csk

నేడు ఐపీఎల్ 2022 టోర్నీలో 41వ మ్యాచ్ జరుగుతోంది. షార్జా క్రికెట్‌ స్టేడియంలో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ముంబై తాత్కాలిక సారథిగా పొలార్డ్‌ వ్యవహరించనున్నాడు. రోహిత్‌ స్థానంలో సౌరభ్‌ తివారీ జట్టులోకి వచ్చాడు. టాస్‌ గెలిచిన పొలార్డ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఆరు విజయాలతో ముంబై పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా చెన్నై కేవలం మూడు విజయాలతో ఆఖరి స్థానంలో నిలిచింది.

జట్ల వివరాలు:

ముంబై ఇండియన్స్‌: క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), సౌరభ్ తివారి, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, నాథన్ కౌల్టర్‌నైల్, రాహుల్ చాహర్, ట్రెంట్ బోల్ట్, జాస్ప్రిత్ బుమ్రా.

చెన్నై సూపర్‌ కింగ్స్‌: సామ్ కరన్, ఫాప్ డుప్లెసిస్, అంబటి రాయుడు, ఎన్. జగదీశన్, ఎంఎస్ ధోనీ (కెప్టెన్/వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, జోష్ హేజిల్‌వుడ్, ఇమ్రాన్ తాహిర్.