ధనుష్…కెప్టెన్ మిల్లర్ సెన్సార్ పూర్తి

42
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’.అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుంది. సెన్సార్ బోర్డ్ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. సంక్రాంతి సెలవులుఈ చిత్రానికి కలిసిరానున్నాయి.

కెప్టెన్ మిల్లర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్ , ధిల్ త్యాగరాజన్, ర్జున్ త్యాగరాజన్ నిర్మించారు.

జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా మొదటి రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టీజర్ కూడా సంచలనం సృష్టించింది.ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సందీప్ కిషన్ , డాక్టర్ శివ రాజ్ కుమార్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. టి రామలింగం ప్రొడక్షన్ డిజైనర్.

బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. నాగూరన్ ఎడిటర్.‘కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

Also Read:కాంగ్రెస్ వచ్చింది..కరెంట్ పోయింది

- Advertisement -