సైకో శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష ఖరారు..

271
Hajipur Serial Killer
- Advertisement -

రాష్ట్రంలో నల్గొండ జిల్లా హాజీపూర్ హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని దోషిగా తేలుస్తూ న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. నల్గొండలోని పోక్సో న్యాయస్థానంలో ఇవాళ ఈ కేసు విచారణ జరిగింది. దీంతో న్యాయస్థానం దోషి శ్రీనివాస్‌ రెడ్డికి ఉరిశిక్షను విధించింది. గతేడాది ఏప్రిల్‌లో నిందితుడు మర్రి శ్రీనివాస్‌ రెడ్డి ముగ్గురు విద్యార్థినులను హత్యాచారం చేసి, హతమార్చినట్లుగా ఆరోపణలు రాగా బాలికలను హత్యాచారం చేసి, నీళ్లు లేని బావుల్లో పూడ్చిపెట్టినట్లుగా దర్యాప్తులో తేలింది.

గురువారం కోర్టు విచారణలో మర్రి శ్రీనివాస్‌ రెడ్డి అమ్మాయిలను హత్యచేసి బావిలో పూడ్చినట్లు నిరూపితమైంది. కాగా కొర్టులో దోషిని ఏమైనా చెప్పుకునేది ఉందా, శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా అని అడిగారు. దీనిపై దోషి శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ.. హత్య కేసుల గురించి తనకేమీ తెలియదన్నాడు. తన ఇల్లు తగలబెట్టారని… భూములు లాక్కున్నారంటూ రోదించాడు. శిక్ష గురించి చెప్పుకునేదేమన్నా ఉందా? అనే ప్రశ్నకు శ్రీనివాస్ రెడ్డి అదే సమాధానం చెప్పినట్టు సమాచారం. కాగా ఈ కేసుల విచారణకు సంబంధించి దాదాపు మూడు నెలల పాటు 101 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.

- Advertisement -