కెనడా కొత్త వీసా నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త వలస & శరణార్థి సంరక్షణ (Immigration and Refugee Protection) నియమాలు అమల్లోకి వచ్చాయి. కొత్తగా తీసుకొచ్చిన వీసా నిబంధనలు భారతీయ విద్యార్థులు, కార్మికులు, పర్యాటకులపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి.
గతంలో Student Direct Stream (SDS) వీసా రద్దు SDS ప్రోగ్రామ్ ద్వారా, విద్యార్థులు ట్యూషన్ ఫీజు & నివాస ఖర్చుల కోసం నిధులను ముందుగా చూపించడం ద్వారా వేగంగా వీసా పొందే అవకాశం ఉండేది. అయితే 2024లో దీన్ని రద్దు చేశారు, దీనివల్ల భారతీయ విద్యార్థులపై ప్రభావం పడింది.
కొత్త మార్పుల ప్రకారం
() ఇలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (eTAs)
() తాత్కాలిక నివాస వీసాలు (TRVs)
()వర్క్ & స్టడీ అనుమతులను రద్దు చేశారు.
Also Read:టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం..
ప్రస్తుతం 4,27,000 భారతీయ విద్యార్థులు కెనడాలో ఉన్నారని భారత విదేశాంగ శాఖ (MEA) ప్రకటించింది. జనవరి – జూలై 2024 మధ్య 3,65,750 భారతీయులు టూరిజం వీసా పొందింది. రు.
వీసా రద్దుకు కారణాలు:
() తప్పుడు సమాచారం ఇవ్వడం
() నేరచరిత్ర కలిగి ఉండటం
() వ్యక్తి మరణం చెందడం
() వీసా పొందిన వ్యక్తి గడువు ముగిసిన తర్వాత కూడా కెనడాలో ఉండటం
() డాక్యుమెంట్లు పోగొట్టుకోవడం, దొంగిలించబడటం, నకిలీగా ఉండటం
() తాత్కాలిక నివాసం నుంచి శాశ్వత నివాసంగా మారడం
() విద్యార్థులకు వర్క్ లేదా స్టడీ వీసా మంజూరుకాకపోవడం
7,000 కంటే ఎక్కువ వీసాల రద్దుకు అవకాశం ఉంది. రద్దు అయిన వీసా ఉన్నవారికి IRCC ఖాతా లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం అందిస్తుంది. ఎవరైనా వీసా తిరస్కరించబడితే, కెనడా ఎంట్రీ పాయింట్ వద్దే నిలిపివేసి మళ్లీ స్వదేశానికి పంపించబడతారు. విద్యార్థులు, కార్మికులు ఇప్పటికే కెనడాలో ఉంటే, వారికి నిర్దిష్ట సమయం ఇచ్చి దేశం విడిచిపెట్టాలనే నోటీసు ఇవ్వబడుతుంది.